HomeTelugu Trendingరజనీకాంత్ పార్ట్ పూర్తి చేసిన 'లాల్ సలాం'

రజనీకాంత్ పార్ట్ పూర్తి చేసిన ‘లాల్ సలాం’

Rajinikanth Lal Salaam upda
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం ‘లాల్ సలాం’. ఈ చిత్రానికి రజనీ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్నారు. విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

క్రికెట్ నేపథ్యంలో రూపొందిస్తున్నారు. క్రికెట్ నేపథ్యంలో జరిగే గొడవలు, మాఫియాతో లింకుల చుట్టూ అల్లుకున్నకథతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

రజనీకాంత్ ఈ చిత్రంలో మాఫియా డాన్ పాత్రలో కనిపించనున్నారు. ‘బాషా’ నుంచి ‘కాలా’ వరకూ ఆయన చాలానే మాఫియా డాన్ పాత్రలను చేసినప్పటికీ, ఈ సినిమాలో రజనీ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుందని అంటున్నారు. టాలీవుడ్ నటి జీవిత రాజశేఖర్ ఈ సినిమాలో రజనీకాంత్‌కు సోదరిగా నటిస్తోంది.

రజనీ కాంత్ పాత్రకు సంబంధించిన షూటింగ్ ఇటీవలే పూర్తిచేశారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం సమకూర్చుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu