HomeTelugu Trendingరజినీకాంత్‌ ఆశీస్సులు తీసుకున్న రాఘవా లారెన్స్‌

రజినీకాంత్‌ ఆశీస్సులు తీసుకున్న రాఘవా లారెన్స్‌

Rajinikanth blessing to Rag
హీరో, కొరియోగ్రాఫ‌ర్ రాఘవా లారెన్స్‌ తాజాగా సూపర్‌ స్టార్‌ ర‌జినీకాంత్ ఆశీస్సులు తీసుకున్నాడు. విషయం ఏమిటంటే.. ర‌జినీకాంత్, పి వాసు కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చంద్ర‌ముఖి సినిమా.. బాక్సాఫీస్ ను ఏ రేంజ్‌లో షేక్ చేసిందో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌సరం లేదు.

మ‌ళ్లీ ద‌శాబ్దమున్నర‌ కాలం త‌ర్వాత సీక్వెల్ చంద్ర‌ముఖి 2 రాబోతుంది. ఇందులో రాఘ‌వా లారెన్స్ ప్రధాన చేస్తున్నాడు. ఇవాళ చంద్ర‌ముఖి 2 షూటింగ్ మైసూర్‌లో షురూ కాబోతుంది. ఈ సంద‌ర్భంగా త‌లైవా ఇంటికెళ్లిన లారెన్స్ ఆయ‌న ఆశీస్సులు తీసుకున్నాడు. ఈ విష‌యాన్ని ట్విట‌ర్ ద్వారా షేర్ చేస్తూ..సినిమా మొద‌ల‌వుతున్న సంద‌ర్భంగా నా గురువు త‌లైవా ఆశీస్సులు తీసుకున్నా. మీ దీవెన‌లు కూడా కావాలి..అని ట్వీట్ చేశాడు లారెన్స్.

లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని తొలి పార్టును డైరెక్ట్ చేసిన పి వాసు చంద్ర‌ముఖి 2కు కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్ప‌టికే రిలీజైన సీక్వెల్ లుక్స్ క్యూరియాసిటీ పెంచేలా ఉన్నాయి. లెజెండ‌రీ కమెడియ‌న్ వ‌డివేలు కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఎంఎం కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu