HomeTelugu Big Storiesఆరోగ్య పరీక్షల కోసం అమెరికా వెళ్లిన రజనీకాంత్‌!

ఆరోగ్య పరీక్షల కోసం అమెరికా వెళ్లిన రజనీకాంత్‌!

Rajinikanth went to america

కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో పలు దేశాలు ఇతర దేశాల విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే సూప‌ర్ ర‌జ‌నీకాంత్ హెల్త్ చెక‌ప్ కోసం ర‌జ‌నీకాంత్ ప్ర‌త్యేక అనుమ‌తి తీసుకొని స్ఫెష‌ల్ ఫ్లైట్‌లో త‌న కుటుంబ స‌భ్యుల‌ని వెంట పెట్టుకొని అమెరికాకు వెళ్లార‌ట‌. ఈ ప్రత్యేక విమానంలో తన కుటుంబసభ్యులతో కలసి రజనీ వెళ్లారట. ఈ విమానంలో పద్నాలుగు మంది వరకూ ప్రయాణించవచ్చట. అమెరికాలో ఒక మల్టీ స్పెషలిటీ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు చేయించుకోబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో రజనీకాంత్ ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అయితే ఇప్పటికే హాలీవుడ్‌ చిత్రం ‘ది గ్రే మ్యాన్‌’ నిమిత్తం రజనీ అల్లుడు, హీరో ధనుష్ ఆయ‌న భార్య ఐశ్వర్య, పిల్లలు కూడా అమెరికాలోనే ఉన్నారట.

కాగా గ‌త ఏడాది అన్నాత్తె షూటింగ్ చేస్తున్న‌ప్పుడు ర‌జ‌నీకాంత్ అధిక రక్త‌పోటుకు గురి కావ‌డం వ‌ల‌న వెంట‌నే ఆయ‌న‌ను హైద‌రాబాద్‌లోని అపోలో ఆసుప‌త్రికి త‌ర‌లించి ప్ర‌త్యేక చికిత్స అందించారు. కాస్త కోలుకున్న త‌ర్వాత అన్నాత్తె చిత్ర షూటింగ్ పూర్తి చేశారు. అనారోగ్య స‌మ‌స్య‌ల వ‌ల‌న ర‌జ‌నీకాంత్ రాజ‌కీయారంగేట్రం ఆలోచ‌న కూడా విర‌మించుకున్న విష‌యం తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu