HomeTelugu Trending35 ఏళ్ల తరువాత రజనీ, కమల్‌!

35 ఏళ్ల తరువాత రజనీ, కమల్‌!

12 19
కోలీవుడ్‌ స్టార్‌ హీరోలైన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ను ఒకే సినిమాలో చూసి దశాబ్దాలు దాటింది. అయితే, అభిమానులకు ఆ అవకాశం మళ్లీ రానుంది. దాదాపు 35ఏళ్ల తర్వాత వీరిద్దరూ ఒకే తెరపై కనిపించనుందట. సినిమా చిత్రీకరణ కూడా ఈ ఏడాదిలోనే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. సినిమా ప్రకటన మార్చి 5న రానున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని కమల్‌ హాసన్‌ సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ప్రొడక్షన్‌ నిర్మిస్తుందని తెలుస్తోంది. సినిమాలో తారాగణం గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. మొదట్లో ఈ సినిమాకు లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నట్లు వార్తలు వచ్చినా.. తాజాగా హెచ్‌.వినోద్‌ పేరు వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని వినోద్‌ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. గతంలో రజనీ, కమల్‌ కాంబినేషన్‌లో దాదాపు 16 సినిమాలు వచ్చాయి. మూడు దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు స్టార్‌ హీరోలను ఒకే సినిమాలో చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చివరిసారిగా వీరిద్దరూ కలిసి బిగ్‌బీ అమితాబ్‌ సినిమా గిరఫ్తార్‌ చిత్రంలో 1985లో కనిపించారు. ఏదేమైనా స్టార్ హీరోలు కలిసి ఒకే తెరపై కనిపిస్తే అభిమానులకు పండగే

Recent Articles English

Gallery

Recent Articles Telugu