HomeTelugu Trendingనేను ట్రోల్స్‌ను పట్టించుకోను.. అది సినిమా అంటున్న రకుల్‌

నేను ట్రోల్స్‌ను పట్టించుకోను.. అది సినిమా అంటున్న రకుల్‌

11 10సినిమాలో సిగరెట్‌ కాల్చినందుకు కూడా తప్పుబడతారా? అని ప్రశ్నిస్తున్నారు నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌. ఆమె హీరోయిన్‌గా నటించిన సినిమా ‘మన్మథుడు 2’. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహించారు. కాగా.. ఇటీవల ఈ చిత్ర టీజర్‌ విడుదలైంది. ఇందులో రకుల్‌ సిగరెట్‌ తాగుతూ కనిపిస్తారు. దాంతో నెటిజన్లు ఆమెను తిట్టిపోస్తున్నారు. ఆమె ఎందరో అమ్మాయిలకు రోల్‌మోడల్‌ అని, ఇలా సిగరెట్లు తాగితే వారూ పాడైపోతారని కామెంట్లు చేస్తున్నారు. దీనిపై రకుల్‌ ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ..

‘ప్రజల పనే అది కదా.. ఏదో ఒకటి అంటూ ఉంటారు. ‘కబీర్‌ సింగ్‌’ లో షాహిద్‌ కపూర్‌ కూడా సిగరెట్‌ తాగారు. ఎందుకంటే ఆయన అలాంటి పాత్రలో నటించారు కాబట్టి. కానీ నిజ జీవితంలో ఆయన శాకాహారి. కాబట్టి ప్రేక్షకులు నిజ జీవితాన్ని సినీ జీవితంతో కలిపి చూడకూడదు. నేను సినిమాలో సిగరెట్లు కాల్చాను. కానీ ఎందుకు కాల్చాల్సి వచ్చింది అన్నది మీకు సినిమా చూస్తే తెలుస్తుంది. నేను ట్రోల్స్‌ను పట్టించుకోను. ఇలాంటివాటి కంటే జీవితంలో చేయాల్సిన ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి’ అని ఘాటుగా సమాధానమిచ్చారు రకుల్‌.

Recent Articles English

Gallery

Recent Articles Telugu