HomeTelugu Trendingఎంజాయ్ చేస్తున్న రకుల్

ఎంజాయ్ చేస్తున్న రకుల్

9 13

రకుల్ ప్రీత్ సింగ్ కు హిట్ లేక చాలాకాలం నుంచి ఇబ్బందులు పడుతున్నది. తోటి స్టార్స్ హిట్స్ కొడుతుంటే రకుల్ ఈ రేస్ లో వెనకబడిపోవడం కాస్త ఇబ్బంది కలిగించే అంశమే. తెలుగు, తమిళంలో ప్రయత్నాలు చేసిన రకుల్… బాలీవుడ్ లో హిట్ కొట్టింది. అజయ్ దేవగణ్ తో చేసిన దేదే ప్యార్ దే సినిమా శుక్రవారం రోజున రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

9c

రకుల్ తన అందాలతో ఆకట్టుకోవడంతో పాటు నటనా పరంగా కూడా పరిణితి చెందింది. 50 సంవత్సరాల వయసున్న వ్యక్తికి గర్ల్ ఫ్రెండ్ గా చేసి మెప్పించింది. బాలీవుడ్ లో రకుల్ హిట్ కొట్టడంతో… ఆమెకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనడంలో సందేహం లేదు. టాలీవుడ్‌లో నాగార్జునతో చేస్తున్న మన్మధుడు 2 సినిమా మరో రెండు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. సూర్యతో చేసిన ఎన్జీకే కూడా మే 31న విడుదల అవుతోంది. ఈ రెండు సినిమాలు హిట్ కొడితే మరలా రకుల్ పంట పండినట్టే.

9a 2

Recent Articles English

Gallery

Recent Articles Telugu