HomeTelugu News'ఎన్టీఆర్‌'లో శ్రీదేవి (రకుల్‌) లుక్‌

‘ఎన్టీఆర్‌’లో శ్రీదేవి (రకుల్‌) లుక్‌

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవితాధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘ఎన్టీఆర్‌’ క్రిష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రాని రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగంలో ఎన్టీఆర్‌ ‘కథానాయకుడు’లో నందమూరి తారక రామారావు సినీ జీవిత విశేషాలను చూపించనున్నారు. ఇప్పటికే వరుస సర్‌ప్రైజ్‌ లతో అలరిస్తున్న ఎన్టీఆర్‌ టీం తాజాగా మరో పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

3 8

ఈ సినిమాలో శ్రీదేవి పాత్రలో కనిపిస్తున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ రోజు రకుల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ బయోపిక్‌ కోసం ఎన్టీఆర్, శ్రీదేవి నటించిన వేటగాడు సినిమాలోని ఆకుచాటు పిందే తడిచే పాటను రీమేక్‌ చేస్తున్నారు. ఆ పాటలోని రకుల్‌ లుక్‌నే రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో ఏఎన్నార్‌గా సుమంత్‌, చంద్రబాబు నాయుడిగా రానా, సావిత్రి పాత్రలో నిత్యామీనన్‌ నటిస్తున్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu