HomeTelugu Trendingరామ్‌చరణ్‌-శంకర్‌ మూవీ ఫస్ట్‌ పోస్టర్‌

రామ్‌చరణ్‌-శంకర్‌ మూవీ ఫస్ట్‌ పోస్టర్‌

Ram charan and shankar movi

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ డైరెక్షన్‌లో భారీ బెడ్జెట్‌ మూవీ ప్రారంభమైంది. సూపర్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ సినిమా పూజా కార్యక్రమం బుధవారం ఉదయం హైదరాబాద్‌లో జరగనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మూవీ యూనిట్‌ తాజాగా ఓ పోస్టర్‌ షేర్‌ చేసింది. శంకర్‌, రామ్‌చరణ్‌, కియారా, దిల్‌రాజు, ఇతర నటీనటులందరూ సూటుబూటు వేసుకుని ఫైల్స్‌ చేతబట్టుకుని వస్తున్నట్లు ఈ పిక్‌లో చూపించారు.

రామ్‌చరణ్‌ 15వ చిత్రంగా ఈ ప్రాజెక్ట్‌ రూపుదిద్దుకోనుంది. కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజలి, సునీల్‌, జయరామ్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ ప్రారంభం కానుంది. మరోవైపు రామ్‌చరణ్‌.. ‘ఆచార్య’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ల ప్రొడక్షన్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నారు.

20210908fr61383b038fb8d

Recent Articles English

Gallery

Recent Articles Telugu