HomeTelugu Trending'బతుకమ్మ' సంబరాల్లో రామ్‌ చరణ్‌ డ్యాన్స్‌

‘బతుకమ్మ’ సంబరాల్లో రామ్‌ చరణ్‌ డ్యాన్స్‌

Ram charan batukamma dancబతుకమ్మ పండుగ (దసరా) సందర్భంగా సెలబ్రెటీలు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫొటోలు వీడియోలు షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ బతుకమ్మ డాన్స్ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ‘బతుకమ్మ’ వేడుకలో పాల్గొనకున్నా ఆయన పాత వీడియో తాజాగా వైరల్ అవుతుంది. రామ్‌ చరణ్‌ ఫ్యాన్ పేజీలో బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వీడియోను షేర్ చేశాడు. బతుకమ్మ పాటకు చరణ్ డాన్స్ చేశాడు.

రామ్ చరణ్ గతంలో ఒకసారి అత్తవారి ఊర్లో దసరా పండుగకు హాజరు అయ్యాడు. ఆ సందర్బంగా స్థానికులు బతుకమ్మ వేడుకలకు చరణ్ ను ఆహ్వానించగా వెళ్లాడు. అప్పుడే ఇలా బతుకమ్మ పాటకు డాన్స్ చేశాడు. అప్పుడు ఈ వీడియో వైరల్ అయ్యింది. మళ్లీ ఇప్పుడు ఒక చరణ్ ఫ్యాన్ షేర్ చేయడంతో మళ్లీ వైరల్ అయ్యింది. చరణ్‌ బతుకమ్మ డాన్స్ ను ప్రస్తుతం ఫ్యాన్స్‌ తెగ వైరల్‌ చేస్తున్నారు.

https://www.instagram.com/p/CGt2QFWhlaW/?utm_source=ig_web_copy_link

Recent Articles English

Gallery

Recent Articles Telugu