
కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో సెలబ్రెటీలు అందరు ఇంటికే పరిమితమై తమ కుటుంబ సభ్యులతో ఈ టైమ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ పవర్ స్టార్ రామ్‌చరణ్ తన సోదరి శ్రీజ చిన్న కూతురు నవిష్కతో కలిసి ఇంట్లో డ్యాన్స్ చేశాడు. ఇంట్లో టీవీ ముందు నవిష్కతో ఆయన చేయించిన డ్యాన్స్ కు సంబంధించిన వీడియో అభిమానులతో పంచుకున్నాడు. ‘ఈ డార్లింగ్‌తో డ్యాన్స్’ అంటూ చెర్రీ ఈ వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియో మెగా ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటోంది. ‘చిరంజీవిలాగా పిల్లలంటే మీకూ చాలా ఇష్టం అనుకుంట. వారసత్వం పునికి పుచ్చుకున్నారు’ అంటూ మెగాఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో కూడా మెగాస్టార్ చిరంజీవి కూడా తన మనవరాలు నవిష్కకు సబంధించిన ఓ విడియోను ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
Dance off with this darling 💃🕺 #Navishka pic.twitter.com/j98yAh8Ski
— Ram Charan (@AlwaysRamCharan) August 4, 2020













