HomeTelugu Trendingబాబాయ్‌ సినిమాలో అబ్బాయ్‌!

బాబాయ్‌ సినిమాలో అబ్బాయ్‌!

5 1
మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ‘ఆర్ఆర్ఆర్‌’ లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు. దాదాపు 80 శాతం వరకు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం కరోనా లాక్ డౌన్ వల్ల వాయిదా పడింది. నెక్ట్స్ షెడ్యూల్ పూనేలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. కాగా రామ్‌ చరణ్ ప్రస్తుతం ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్యలో కూడా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

ఇక తన బాబాయ్ పవన్ కళ్యాణ్ విరూపాక్షలో కూడా అతిథి పాత్రలో మెప్పించబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా క్రిష్ డైరెక్షన్లో ఓ పిరియాడిక‌ల్ చిత్రం తెరకెక్కనుంది. పాన్ ఇండియా లెవ‌ల్ లో తెర‌కెక్క‌బోతున్న ఈ సినిమాలో ప‌వ‌న్ ఓ ప‌వ‌ర్ ఫుల్ దొంగగా క‌న‌ప‌డబోతున్న‌ట్లు ప్ర‌చారం సాగుతుంది. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్, రాంచ‌ర‌ణ్ లు ఒకే సినిమాలో న‌టిస్తుండ‌టంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu