HomeTelugu Big Storiesవారసులు ఆ సూపర్ హిట్ మూవీని రీమేక్‌ చేయనున్నారా!

వారసులు ఆ సూపర్ హిట్ మూవీని రీమేక్‌ చేయనున్నారా!

7 10
టాలీవుడ్‌ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మంచు మనోజ్ ఫ్రెండ్‌షిప్‌ గురించి తెలిసిందే. ఆ స్నేహంతోనే రామ్ చరణ్.. తాజాగా మంచు మనోజ్ హీరోగా రీఎంట్రీ ఇస్తున్న ‘అహం బ్రహ్మాస్మి’ సినిమా ఓపెనింగ్‌కు క్లాప్ కొట్టాడు. తాజాగా వీళ్లిద్దరు ఓ సినిమాలో కలిసి నటించడానికి రెడీ అయినట్లు సమాచారం. వీళ్లిద్దరు చిరంజీవి, మోహన్ బాబు కలిసి నటించిన ‘బిల్లా రంగా’ సినిమాను ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టు రీమేక్ చేయాలనున్నట్టు తెలుస్తుంది. అందులో వీళ్లిద్దరు వాళ్ల తండ్రుల పాత్రలో నటించబోతున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో చిరంజీవి, మోహన్ బాబు తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసారు. కే.యస్.ఆర్.దాస్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని పింజల నాగేశ్వరరావు నిర్మించారు. అప్పట్లో ఈ సినిమా పెద్ద సెన్సేషనే క్రియేట్ చేసింది. అంతేకాదు ఈ చిత్రం అప్పటి వరకు ఉన్న యాక్షన్ చిత్రాల్లో కొత్త ఒరవడి అనే చెప్పాలి.

ఇక ‘బిల్లా రంగా’ రీమేక్ విషయంపై కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఒకవేళ ఈ రీమేక్ పట్టాలెక్కితే.. ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారనేది చూడాలి. రామ్ చరణ్, మంచు మనోజ్ సంయుక్తంగా తెరకెక్కించాలనుకున్నట్టు చెబుతున్నారు.

7a

Recent Articles English

Gallery

Recent Articles Telugu