HomeTelugu Big Stories'ఆర్‌ఆర్‌ఆర్‌' మూవీ వాయిదా.. ప్రకటించిన చిత్రబృందం

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ వాయిదా.. ప్రకటించిన చిత్రబృందం

RRR movie
యావత్‌ భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. స్టార్‌ డైరెక్టర్‌ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఎన్నో క్లిష్ట పరిస్థితులను దాటుకుని జనవరి 7న విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలో సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఎంతో కష్టపడి పనిచేసినా, కొన్ని పరిస్థితులు తమ చేయి దాటిపోయాయని పేర్కొంది. దేశంలో పలు రాష్ట్రాల్లో థియేటర్లు మూత పడటంతో సినిమా విడుదలను వాయిదా వేయటం తప్ప తమకు మరో మార్గం కనిపించలేదని చిత్ర బృందం తెలిపింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికి నాలుగు సార్లు వాయిదా పడింది. మరోసారి వాయిదా పడటంతో నెటిజన్లు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu