HomeTelugu Trendingవికారాబాద్‌ అడవుల్లో రామ్‌చరణ్‌ షూటింగ్‌..

వికారాబాద్‌ అడవుల్లో రామ్‌చరణ్‌ షూటింగ్‌..

8 9
మెగా పవర్‌ స్టార్‌.. రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, రాజమౌళి.. క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. టాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌ సీతారామరాజుగా, ఎన్టీఆర్‌ కొమరం భీంగా కనిపించనున్నారనే విషయం తెలిసిందే. ఇటీవల ఎన్టీఆర్‌పై అరకులో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించిన చిత్రబృందం తాజాగా రామ్‌చరణ్‌పై వికారాబాద్‌ అడవుల్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఇక్కడ చెర్రీపై యాక్షన్‌ సన్నివేశాలను షూట్‌ చేయనున్నారట. అయితే వారం రోజులపాటు ఈ షూట్‌లో రామ్‌ చరణ్‌ పాల్గొననున్నారని టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా రాత్రి వేళ అధిక భాగం తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో తారక్‌పై సన్నివేశాలుండవని టాక్‌. ఇప్పటికే సగానికిపైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu