HomeTelugu Newsచరణ్ ఫస్ట్‌లుక్‌, టీజర్‌ డేట్స్‌ ఫిక్స్‌!

చరణ్ ఫస్ట్‌లుక్‌, టీజర్‌ డేట్స్‌ ఫిక్స్‌!

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ రంగస్థలం వంటి బస్టర్‌హిట్‌ తరువాత బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మాస్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రషూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్‌డేట్‌ వచ్చేసింది.

3 3

షూటింగ్‌ మొదలైనప్పటి నుంచి రామ్‌చరణ్‌కు సంబంధించి ఫస్ట్‌లుక్‌ను గానీ, టైటిల్‌ను గానీ విడుదల చేయని చిత్రయూనిట్‌ ఈ దీపావళికి అభిమానులను ఖుషీ చేయబోతోంది. నవంబర్‌ 6 మధ్యాహ్నం ఒంటి గంటకు చెర్రీకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను, నవంబర్‌ 9 ఉదయం 10:25 గంటలకు టీజర్‌ను విడుదలచేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో కైరా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తుంది. స్నేహ, జీన్స్‌ ఫేమ్‌ ప్రశాంత్‌, ఆర్యన్‌ రాజేష్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu