HomeTelugu Trending'నీళ్లలో నిప్పు' చెర్రీ వీడియో షేర్‌ చేసిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' టీమ్‌

‘నీళ్లలో నిప్పు’ చెర్రీ వీడియో షేర్‌ చేసిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌

Ram charan video Shares RRR
రాజమౌళి డైరెక్షన్‌లో రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతున్న భారీ మాల్టీస్టారర్‌ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియోను ఆ సినిమా యూనిట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే. నీళ్లలో నిప్పు అంటూ చెర్రీపై చిత్రీకరిస్తున్న ఓ సన్నివేశానికి సంబంధించిన ఓ షాట్ ను ఆ సినిమా యూనిట్ పంచుకుంది.

ఇప్పటికే అల్లూరి సీతారామరాజుగా నటిస్తోన్న రామ్ చరణ్ కు సంబంధించిన టీజ‌ర్‌‌ను ఇప్ప‌టికే సినిమా బృందం విడుద‌ల చేసింది. నిప్పు మ‌ధ్యలో ఆయ‌న పోరాటానికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు ఉన్న‌ ఆ టీజ‌ర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మ‌రోవైపు ఈ సినిమాలో కొమరం భీమ్‌గా నటిస్తోన్న ఎన్టీఆర్ టీజ‌ర్ సంద‌ర్భంగా ఆయ‌న‌ నీళ్లలోంచి ఆయుధం తీస్తున్న‌ట్లు చూపించింది. చెర్రీని నిప్పుగా, ఎన్టీఆర్‌ను నీరుగా ఈ సినిమా యూనిట్ పేర్కొంటోన్న విష‌యం తెలిసిందే. ఈ ఏడాది అక్టోబర్ 13వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

View this post on Instagram

 

A post shared by RRR Movie (@rrrmovie)

Recent Articles English

Gallery

Recent Articles Telugu