HomeTelugu Trending'నఘం' మూవీ టీజర్‌

‘నఘం’ మూవీ టీజర్‌

Ram gopal varma launched na
గణేష్ రెడ్డి, వేమి మమత రెడ్డి, అయేషా టక్కి, రాజేంద్ర కుమార్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం ‘నఘం’. విభు ప్రొడక్షన్స్ బ్యానర్ పై శివ దొసకాయల ఈ సినిమాను నిర్మించగా నరసింహ జీడీ దర్శకత్వం వహించారు. హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపారు. ఒక్క డైలాగ్‌ లేకుండా.. కేవలం బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో కట్‌ చేసిన ఈ టీజర్‌.. అందరిని ఆకట్టుకుంటుంది.

భగవత్‌ సంగీతం అందించారు. హారర్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా, సీటు అంచున కూర్చోబెట్టేలా ఉంటుందని చిత్రయూనిట్ తెలిపింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరామెన్‌గా అరవింద్ బి వ్యవహరించగా కిచ్చు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu