HomeTelugu Trendingవివాహం మరణం అయితే.. విడాకులు అన్నది పునర్జన్మ లాంటిది: ఆర్జీవీ

వివాహం మరణం అయితే.. విడాకులు అన్నది పునర్జన్మ లాంటిది: ఆర్జీవీ

ram gopal varma tweet on sa

వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సమంత-నాగ చైతన్య విడాకులపై తనదైన స్టైల్‌లో స్పందించారు. పెళ్లిళ్లు కాదు.. విడాకులను సెలబ్రేట్‌ చేసుకోవాలి. వివాహం మరణం అయితే.. విడాకులు అన్నది పునర్జన్మ లాంటిది అంటూ ఆర్జీవీ ట్వీట్‌ చేశారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పెళ్లి, విడాకులపై ఆర్జీవీ మాట్లాడిన వీడియోను షేర్‌ చేశారు.

కొన్ని రోజుల నుంచి వస్తున్న విడాకుల పుకార్లను నిజం చేస్తూ నాగ చైతన్య-సమంత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. భార్య భర్తలుగా కలిసి ఉండలేమని, ఎంతగానో ఆలోచించి విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో విడాకులపై ఆర్జీవీ చేసిన ట్వీట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu