HomeTelugu Trendingరామ్‌ చరణ్ ఖరీదైన వాచ్ వైరల్

రామ్‌ చరణ్ ఖరీదైన వాచ్ వైరల్

 

Ramcharan watch
సెలబ్రెటీలు ధరించిన దుస్తులు, వాచ్‌లు, షూస్, హ్యండ్‌బ్యాగ్‌ ఇలా అన్నింటి ధరలు సోషల్ మీడియాలో ఇప్పుడు హల్‌చల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రామ్ చరణ్ ధరించిన ఓ వాచ్ ఖరీదుపై కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. రామ్‌ చరణ్ ఈ మధ్య ఎక్కువగా ఇదే వాచ్‌తో కనిపిస్తున్నాడు. ఆ వాచ్ ఖరీదు తెలిసి అందరూ షాకవుతున్నారు. చరణ్ ధరించిన వాచ్ 1.50 లక్షల డాలర్లు అట. రూపాయల్లో దీని ధర సుమారు కోటిన్నర. ఇప్పుడు ఆ వాచ్ ఖరీదు బయటపడటంతో అంత కాస్ట్‌లీనా అంటూ నెటిజన్లు ఆశ్చర్యం పోతున్నారు.
ఇంత ఖరీదైన వాచ్‌తో సామాన్యులు జీవితాంతం సంతోషంగా బతికేయచ్చు అని అంటుంటే.. మరికొందరు స్టార్స్‌ అన్నప్పుడు ఆమాత్రం ఉండాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక మరోవర్గం వారు ఆ వాచ్ డబ్బులు పేదవాళ్లకు ఇస్తే ఎంతోమంది బాగుపడతారు అంటున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం యంగ్‌టైగర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆర్‌ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్నాడు. చెర్రీకి జోడీగా బాలీవుడ్ నటి ఆలియా భట్ నటిస్తోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య’ తోనూ రామ్ చరణ్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న చరణ్‌ ఓ కీలక పాత్రలోనూ కనిపించనున్నాడు.

https://www.instagram.com/p/CNWgb7DJWog/?utm_source=ig_web_copy_link

Recent Articles English

Gallery

Recent Articles Telugu