HomeTelugu Big Storiesరానా బర్త్‌డే స్పెషల్‌: 'భీమ్లా నాయక్‌' నుండి స్పెషల్‌ వీడియో విడుదల

రానా బర్త్‌డే స్పెషల్‌: ‘భీమ్లా నాయక్‌’ నుండి స్పెషల్‌ వీడియో విడుదల

Rana special video from bhe

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, రానా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్‌. ఈ రోజు రానా పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్రకు సంబంధించిన పవర్‌ఫుల్‌ వీడియోను చిత్ర బృందం మంగళవారం విడుదల చేసింది. ‘వాడు అరిస్తే భయపడతావా? నేను వాడికన్నా గట్టిగా అరవగలను. అయినా ఎవడు వాడు? పైనుంచి దిగొచ్చాడా?’ అంటూ రానా చెప్పిన సంభాషణలు విశేషంగా అలరిస్తున్నాయి. మధ్యలో పవన్‌ కల్యాణ్‌ కూడా దర్శనమిచ్చారు. ఈ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ టైటిల్‌ పాత్ర పోషిస్తుండగా డానియల్‌ శేఖర్‌గా రానా కనిపించనున్నారు. నిత్య మేనన్‌, సంయుక్త మేనన్‌ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. సాగర్‌ కె. చంద్ర డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్నారు. ఈసినిమా 2022 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu