మరో హీరో సినిమాకు రానా వాయిస్

టాలీవుడ్‌ నటుడు ‘రానా దగ్గుబాటి’.. హీరోగా, విలన్ గా నటిస్తూ కొన్ని సినిమాలకు వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నాడు. ఇటీవలే వచ్చిన ఎవెంజర్స్ తెలుగు వెర్షన్‌కు రానా వాయిస్ ఓవర్ ఇచ్చాడు. రానాది బేస్ వాయిస్ కావడంతో.. కొన్ని కీలకమైన సీన్స్ కోసం రానా వాయిస్ ను అడుగుతున్నారట. సుమంత్ నటిస్తున్న సుబ్రహ్మణ్యపురం సినిమా కోసం రానా వాయిస్ అందిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమా రానా వాయిస్ తో ఓపెన్ అవుతుందట. అలాగే క్లోజింగ్ కూడా రానా వాయిస్ తోనే అవుతుందని అంటున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రానా వాయిస్ ప్లస్ అవుతుందని సుమంత్ భావిస్తున్నాడు.