HomeTelugu Trending'అపరిచితుడు'గా రణ్‌వీర్‌ సింగ్‌!

‘అపరిచితుడు’గా రణ్‌వీర్‌ సింగ్‌!

Ranveer singh wtih aparichi

బాలీవుడ్ స్టార్‌ హీరో, దీపిక పదుకొనే భర్త రణ్‌వీర్ సింగ్‌.. తెలుగులో హిట్ అయిన ‘టెంపర్’ రీమేక్ ‘సింబా’తో బడా హిట్ అందుకున్నాడు. రణ్‌వీర్ నటించిన ‘సూర్యవంశీ, 83’ సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. ఇక ‘జయేష్‌భాయ్ జోర్ దార్’ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ‘సర్కస్’ షూటింగ్ లో ఉంది. ఈ సినిమా తర్వాత మరో సౌత్ హిట్ మూవీ రీమేక్‌ చేయాలనుకుంటున్నాడట. 16 ఏళ్ళ క్రితం విక్రమ్ హీరోగా నటించిన ‘అన్నియన్ (అపరిచితుడు)’ కావటం విశేషం. ఈ విషయమై శంకర్ తో చర్చలు కూడా నడిచాయట.

‘అపరిచితుడు’ తమిళంతో పాటు తెలుగులోనూ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తిగా విక్రమ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమా అది. దక్షిణాదినే కాదు హిందీలో డబ్ అయి ఉత్తరాది వారినీ అలరించిన సినిమా ఇది. ఇన్నేళ్ళ తర్వాత దీనిని రీమేక్ చేయటానికి రణవీర్ సింగ్ ఆసక్తి చూపించటమే మరింత ఆసక్తి కలిగించే అంశం. సమాజంలో ఇప్పటికీ అప్పటికంటే అవినీతి మరింతగా పెరిగిపోయింది. అయితే… కథనంలో కొన్ని మార్పులు చేసి తెరకెక్కిస్తే ఆకట్టుకోవడం ఖాయమే అంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu