HomeTelugu Trendingవరుస ఆఫర్లతో దూసుకుపోతున్న రష్మిక

వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న రష్మిక

Rashmika got another chance

టాలీవుడ్‌ బ్యూటీ రష్మిక వరుస ఆఫర్లతో బీజీగా ఉంది. తెలుగులో పలు క్రేజీ చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీ అయిపోతోంది బ్యూటీ. అప్పుడే తన మూడో బాలీవుడ్ చిత్రానికి రష్మిక సంతకం చేసిందని సమాచారం. సోమవారం తన ఇన్ స్టాగ్రామ్ లైవ్ సెషన్ లో ఈ విషయాన్ని రష్మిక స్వయంగా వెల్లడించింది. తన మూడవ బాలీవుడ్ చిత్రానికి సంతకం చేయడానికి రెడీగా ఉన్నానని తెలిపారు. రష్మిక బాలీవుడ్‌లో తన తొలి చిత్రం పూర్తి అవ్వక ముందే రెండవ చిత్రానికి సంతకం చేసింది. ‘టాప్ టక్కర్’ వీడియోతో రష్మిక ఎంట్రీ అదిరింది. స్పై థ్రిల్లర్ మిషన్ మజ్ను తో ఆమె బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న రష్మిక.. అమితాబ్ బచ్చన్ నటించిన ‘గుడ్ బాయ్’లో రెండో అవకాశం అందుకుంది. ఈ చిత్రంలో అమితాబ్- రష్మిక తండ్రి కూతుళ్లుగా కనిపిస్తారు.

ఇంటరాక్టివ్ సెషన్లో ఒక అభిమాని ఆమె ఇతర బాలీవుడ్ ప్రాజెక్టుల గురించి అడిగినప్పుడు ‘నేను రెండు బాలీవుడ్ సినిమాలు చేస్తున్నాను. త్వరలో మూడవ చిత్రానికి సంతకం చేయబోతున్నాను’ అని ఆమె సమాధానం ఇచ్చింది. అయితే అది ఎవరితో అన్నది వెల్లడించలేదు. తెలుగు కన్నడ చిత్రాల్లో తనదైన ముద్ర వేసిన రష్మిక నేషనల్ క్రష్ గా ఎదిగింది. అల్లు అర్జున్ తో పుష్ప లాంటి భారీ పాన్ ఇండియా చిత్రంలోనూ రష్మిక నటిస్తోంది. తదుపరి శంకర్ – చరణ్ సినిమాలోనూ నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu