HomeTelugu Trendingపుష్పలో తనకు ఇష్టమైన రోల్ అంటున్న రష్మిక

పుష్పలో తనకు ఇష్టమైన రోల్ అంటున్న రష్మిక

Kiara role in Pushpa movie

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప. ఈ చిత్రంలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లు. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రానున్న సంగతి తెలిసిందే. మొదటి భాగం షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇందులో రష్మిక తన పాత్ర చాలా కొత్తగా, ఆసక్తికరంగా ఉండబోతుందట. పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపిస్తానని, ప్రేక్షకులు నా పాత్రకు కనెక్ట్ అవుతారని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

ఇంతవరకు తాను చేయని పాత్ర చేసినట్లు చెప్తోంది. ఈ సినిమా రెండు భాగాల్లోనూ తాను కనిపించనున్నట్టు తెలిపింది. ఛలో సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన రష్మిక వరుసగా అవకాశాలు అందుకుంటూ అతి తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్ల జాబితాలో చేరింది. వరుస హిట్స్ అందుకుంటూ ఫామ్‌లో ఉంది. ఓవైపు టాలీవుడ్‌లో తన సత్తా చాటుతూ బిజీగా ఉంది. మరోవైపు బాలీవుడ్‌లో రెండు సినిమాలు చేస్తోంది రష్మిక. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ మూవీలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో బన్నీ కనిపించబోతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu