HomeTelugu Trendingరాశి ఖన్నాకు బాలీవుడ్‌ ఛాన్స్‌!

రాశి ఖన్నాకు బాలీవుడ్‌ ఛాన్స్‌!

rasi khanna in bollywood m

రాశి ఖన్నా టాలీవుడ్‌లో ప్రస్తుం చైతూ జోడీగా ‘థ్యాంక్యూ’ . గోపీచంద్ సినిమాలో ‘పక్కా కమర్షియల్’లో హీరోయిన్‌గా నటిస్తుంది. తమిళంలో ఆమె చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలు చేస్తూనే ఆమె హిందీలో వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది. మొత్తం మీద ఖాళీగా లేకుండా రాశి ఖన్నా తన కెరియర్ ను కొనసాగిస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఆమెకి ‘యోధ’ సినిమాలో ఛాన్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది. కరణ్ జొహార్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, పుష్కర్ ఓజా దర్శకత్వం వహించనున్నాడు. సిద్ధార్థ్ మల్హోత్రా సరసన ఒక హీరోయిన్‌గా దిశా పటాని చేయనుండగా, మరో నాయికగా రాశి ఖన్నాను తీసుకున్నారట. కాస్త ఆలస్యమైనా అనుకున్న దిశగానే రాశి ఖన్నా ముందుకు వెళుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu