HomeTelugu Trending'రావణాసుర' ఫస్ట్‌ సింగిల్‌ వచ్చేసింది

‘రావణాసుర’ ఫస్ట్‌ సింగిల్‌ వచ్చేసింది

Ravanasura Anthem Lyrical
మాస్‌ మహారాజా రవితేజ హీరోగా.. సుధీర్‌ వర్మ డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం ‘రావణాసుర’.ముందుగా ఇచ్చిన అప్‌డేట్‌ ప్రకారం రావణాసుర ఫస్ట్ సింగిల్‌ ను విడుదల చేసింది చిత్రబృందం. దశకంఠ లంకాపతి రావణా.. అంటూ సాగే ఈ పాటను హర్షవర్దన్ రామేశ్వర్‌- భీమ్స్‌ సిసిరోలియో కంపోజ్‌ చేయగా.. శాంతి పీపుల్‌, నోవ్‌లిక్‌ పాడారు.

ఈ సాంగ్ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది. రావణాసుర చిత్రంలో అనూ ఎమ్మాన్యుయేల్‌, పూజిత పొన్నాడ, దక్షా నగార్కర్‌, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాశ్‌ ఫీ మేల్‌ లీడ్ రోల్స్‌ లో నటిస్తున్నారు. టాలీవుడ్ యాక్టర్‌ సుశాంత్‌ విలన్‌గా నటిస్తున్నాడు.

అభిషేక్ పిక్చర్స్‌, రవితేజ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రావు రమేశ్‌, మురళీ శర్మ, సంపత్‌ రాజ్‌, నితిన్‌ మెహతా కీలక పాత్రలు పోషిస్తున్నారు. రావణాసుర చిత్రాన్ని 2023 ఏప్రిల్‌ 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ మూవీకి హర్షవర్దన్ రామేశ్వర్‌- భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు

Recent Articles English

Gallery

Recent Articles Telugu