HomeTelugu Trendingసూపర్ మార్కెట్ సిబ్బందికి టెంపరేచర్ చెక్ చేస్తున్న రవి బాబు.. వీడియో

సూపర్ మార్కెట్ సిబ్బందికి టెంపరేచర్ చెక్ చేస్తున్న రవి బాబు.. వీడియో

6 5

టాలీవుడ్ నటుడు, దర్శకుడు రవిబాబు ఎప్పుడు చాలా డిఫరెంట్‌గా ఆలోచిస్తూ ఉంటాడు. ఆయన సినిమాలు కూడా ఇటువంటి కాన్సప్ట్ లతో ఉంటాయి. రవిబాబు తీసే సినిమాలే కాదు బయట ఆయన వ్యవహార శైలి కూడా వినోదాత్మకంగా ఉంటుంది. కొన్నాళ్ల కిందట పందిపిల్లతో ఏటీఎం వద్దకు వచ్చి వార్తల్లోకెక్కాడు. ఆ మధ్య రవిబాబు కరోనాకు పుట్టినరోజు కూడా చేశాడు. తాజాగా, కరోనా నేపథ్యంలో ఓ సూపర్ మార్కెట్ వద్ద తన స్టైల్‌లో నవ్వులు పూయించారు. తాజాగా ఓ షాపింగ్ మాల్‌కి వెళ్లిన రవిబాబుని సెక్యూరిటీ గార్డ్ తన దగ్గర ఉన్న థర్మల్ స్కానర్‌తో టెంపరేచర్ చెక్ చేశాడు. వెంటనే రవిబాబు కూడా తన జేబులో ఉన్న థర్మల్ స్కానర్‌ని తీసి సెక్యూరిటీ గార్డ్ టెంపరేచర్ చెక్ చేశాడు. ఆపై, నీకేమీ లేదు, నువ్వు ఓకే అని చెప్పి సూపర్ మార్కెట్లోకి సీరియస్ గా వెళ్లిపోయారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ript>

Recent Articles English

Gallery

Recent Articles Telugu