HomeTelugu Trendingఏఆర్‌ రెహమాన్‌ మేనల్లుడి 'రెబెల్‌' ఫస్ట్‌లుక్‌

ఏఆర్‌ రెహమాన్‌ మేనల్లుడి ‘రెబెల్‌’ ఫస్ట్‌లుక్‌

rebel movie first look 1ఏఆర్ రెహ‌మాన్ మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చి సినీ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ మంచి గుర్తింపు సంపాదించాడు జీవీ.ప్రకాశ్‌ కుమార్ . సంగీత దర్శకుడిగా, నటుడిగా సౌత్ ఇండస్ట్రీలో మంచి పేరుతో వరుస విజయాలతో దూసుకుపోతున్న జీవీ తాజాగా నటిస్తున్న చిత్రం ‘రెబెల్’. మమితా బైజూ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమాతో నికేష్ ఆర్ఎస్ తిరుప‌తి దర్శకుడిగా ప‌రిచ‌యం అవుతుండ‌గా.. స్టూడియో గ్రీన్ పతాకంపై నిర్మాత జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ చివ‌రిద‌శ‌లో ఉంది. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ తాజాగా ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్ వ‌దిలారు.

కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెర‌కెక్కుతున్న‌ట్లు తెలుస్తుంది. కాగా ఈ సినిమాపై ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ.. 1980లలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇక సినిమా కథ కాలేజీ స్టూడెంట్స్, రాజకీయాల చుట్టూ తిరుగుతుంది. ఇది జీవీ కెరియర్లో ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుందని నికేష్ తెలిపారు.

ఈ సినిమాలో జీవీ ప్రకాష్ కుమార్, మమితా బైజు, కరుణాస్, సుబ్రమణ్య శివ, షాలు రహీమ్, వెంకటేష్ విపి, ఆదిత్య భాస్కర్, కోలేజ్ వినోద్, ఆదిరా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి అరుణ్ రాధాకృష్ణన్ సినిమాటోగ్రఫీ చేస్తుండ‌గా.. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.

Image

Recent Articles English

Gallery

Recent Articles Telugu