HomeTelugu Trendingపెళ్లిపై రెజీనా షాకింగ్‌ కామెంట్స్‌

పెళ్లిపై రెజీనా షాకింగ్‌ కామెంట్స్‌

Regina Cassandra comments o
రెజీనా కాసాండ్రా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘శాకిని డాకిని’. కొరియన్ మూవీ ‘మిడ్ నైట్ రన్నర్స్’ కు రీమేక్ ఇది. సుధీర్ వర్మ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ గురు ఫిలింస్ క్రాస్ పిక్చర్స్ బ్యానర్లపై దగ్గుబాటి సురేష్ బాబు సునీత తాటి థామస్ కిమ్ నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబర్ 16న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ.. సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రెజీనా.. తన పెళ్లిపై స్పందించింది.

రెజీనా మాట్లాడుతూ.. ‘నేను గతంలో ఒకరిని ప్రేమించాను. కొన్ని కారణాల వల్ల మా ప్రేమ 2020లోనే ముగిసిపోయింది. దాని నుంచి బయటపడటానికి కొంత టైమ్ పట్టింది. ఇప్పుడు మాత్రం ఎవరిని ప్రేమించడం లేదు. సింగిల్ గానే ఉన్నాను. ప్రేమ పెళ్లి వంటి విషయాలపై మాట్లాడటం నాకు అస్సలు ఇష్టం లేదు. అసలు లైఫ్ లో పెళ్లి చేసుకుంటానో.. లేదో.. కూడా తెలియదు. ఒకరిపై ఆధారపడకుండా సొంతంగా ఎలా జీవించాలో చిన్నతనం నుంచే అమ్మ నేర్పింది. అందుకే జీవితంలో నాకు తోడు కావాలా? వద్దా? అన్న విషయంపై అస్సలు ఆలోచించను’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu