HomeTelugu Trending'ఆద్య'గా రేణు దేశాయ్‌..

‘ఆద్య’గా రేణు దేశాయ్‌..

Renu desai is coming with w
నటి రేణు దేశాయ్‌ సరైన కథ దొరికితే సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని చూస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాలో ఆమెనటిస్తుందనే వార్తలొచ్చినా అవి అబద్ధాలే అని తేలిపోయాయి. ఇప్పుడు రేణు దేశాయ్ ఓ వెబ్ సిరీస్ లో నటించడానికి సిద్ధమయ్యారు. రైతులపై సినిమా తెరకెక్కించాలని చూస్తున్నారు రేణు దేశాయ్. ఇటీవల ఆమె సోషల్ మీడియా వేదిక గా తాను ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నానని వెల్లడించింది. ఓ అద్భుతమైన వెబ్‌సిరీస్‌కి సంతకం చేశాను. మీ అందరి ఆశీర్వాదం కావలి . వచ్చే నెలలో ఈ వెబ్ సిరీస్ షూటింగ్ మొదలు అవుతుంది. ఈ వెబ్‌ సిరీస్‌కి ఎమ్‌ఆర్ కృష్ణ మామిడాల దర్శకత్వం వహిస్తున్నారు. డీఎస్ రావు, ఎస్ రజనీకాంత్ నిర్మిస్తున్నారు. దాశరధి సివేంద్ర సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఒక మహిళ సత్యాన్వేషణ క్రమంలో ఎదుర్కొన్న సవాళ్లు ఏంటీ.. ఆమెకు సంబంధించిన ఇబ్బందులను ఎలా అధిగమించింది అనేది ఈ వెబ్ సిరీస్ లో చూపించబోతున్నారట. కాగా ఈ వెబ్ సిరీస్ కు ‘ఆద్య’ అనే టైటిల్ ను అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్.. రేణు దేశాయ్ ల కూతురు పేరు ఆద్య అనే విషయం తెల్సిందే. ఇప్పుడు ఈ టాపిక్ ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సిరీస్ కు కావాలనే ఆద్య అనే టైటిల్ పెట్టారా లేక యాధృచ్చికంగా జరిగిందా అన్నది చర్చనీయాంకశంగా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu