HomeTelugu Big Storiesఆర్జీవీ 'పవర్ స్టార్' ట్రైలర్

ఆర్జీవీ ‘పవర్ స్టార్’ ట్రైలర్

RGV Power Star Trailer le

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ ‘పవర్ స్టార్’‌ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదలైనప్పటి నుండి రోజుకో పోస్టర్‌ను విడుదల చేస్తున్నాడు. వర్మ ‘గ‌డ్డి తింటావా?’ అంటూ సాగే ఈ పాటను ఇటీవల విడుద‌ల చేశాడు. ఇక ఈ సినిమా ట్రైలర్‌కు కూడా డబ్బులు పెట్టి చూడాలి అని ప్రకటించాడు వర్మ. అందుకోసం రూ. 25 వసూలు చేశాడు. సినీ చరిత్రలో ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా సినిమా ట్రైలర్‌కూ టిక్కెట్ పెట్టాడు వర్మ. జులై 22న ఉదయం 11 నుంచి “పవర్ స్టార్” ట్రైలర్ ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో అందుబాటులో ఉంటుందని, ఈ ట్రైలర్ చూడాలంటే ‘పే ఫర్ వ్యూ’ పద్ధతిలో 25 రూపాయలు చెల్లించాలని చెప్పాడు వర్మ.

అయితే ‘పవర్ స్టార్’ ట్రైలర్‌ను ఆయన దగ్గర పనిచేసే సిబ్బంది ఆన్‌లైన్‌లో లీక్‌ చేసి వర్మకు పెద్ద షాక్ ఇచ్చారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా చెప్పాడు వర్మ. ‘ఈరోజు ఉదయం 11 గంటలకు విడుదల కావాల్సిన పవర్ స్టార్ ట్రైలర్ లీక్ అయ్యిందంటూ ఓ అరగంట ముందుగానే ఆ ట్రైలర్‌ను ఆయన తన యూట్యూబ్ ఛానల్‌లో విడుదల చేశాడు. ఇది మా సొంత కార్యాలయ సిబ్బందిలో ఒకరు చేసిన పనిగా అనుమానిస్తున్నాం. మేము పూర్తి బాధ్యత వహిస్తూ చర్యలు తీసుకుంటాం. ట్రైలర్ కోసం అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వాళ్ల డబ్బులు తిరిగి ఇవ్వబడతాయి’ అంటూ ట్వీట్ చేశాడు వర్మ.

ఇక వర్మ రిలీజ్ చేసిన ట్రైలర్ విషయానికి వస్తే.. ట్రైలర్‌లో రెండు మూడు డైలాగ్స్ పేలుతున్నాయి. ముఖ్యంగా చిరంజీవిలా కనిపిస్తున్న ఓ వ్యక్తి సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న క్యారెక్టర్‌తో మాట్లాడుతూ.. నీ గుండెల మీద చేయి వేసుకుని చెప్పరా.. నువ్వు పవర్ స్టార్ అయ్యింది..కానిస్టేబుల్ కొడుకు గానా.. లేఖ నా తమ్ముడి గానా అనే డైలాగ్ పేలుతుంది..ఇంకా ఇలాంటివి రెండు మూడు ఉన్నాయి. ఇక పవర్ స్టార్ సినిమా ఈనెల 25న ఆర్జీవీ వరల్డ్‌ థియేటర్‌లో విడుదలకానున్నట్లు ప్రకటించాడు
ఈ సినిమాలో చంద్రబాబునీ వదల్లేదు వర్మ. ‘సత్యప్రమాణంగా చెప్తున్నాను బ్రదర్.. మీరు ఓడిపోయినందుకు చాలా బాధపడుతున్నాను’ అంటూ పవర్ స్టార్‌తో బాబు చెప్పే డైలాగ్‌తో మంటపెట్టాడు వర్మ. ఇక పవన్‌ ఫ్యాన్స్‌ని కూడా ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు. పవన్ శత్రువు

కత్తి మహేష్‌నూ ఈ సినిమాలో చూపించాడు. ‘గగన్ సీఎం కాడని బాహుబలి రేంజ్‌లో రంకెలు వేశారు.. ఇప్పుడు ఆయనే సీఎం.. ఇప్పుడేమంటారు’ అంటూ పవర్ స్టార్‌ను ప్రశ్నించే జర్నలిస్ట్ అవతారం ఎత్తాడు కత్తి మహేష్. ఇక నాగబాబునీ వదల్లేదు వర్మ. నిన్ను, అన్నయ్యను ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేది లేదు.. నువ్ అసమర్థుడివి అని.. ప్యాకేజ్ స్టార్‌వి అని.. గుండు సున్నావి అని.. అందరూ నోటికొచ్చినట్టు వాగుతుంటే.. నాకు పిచ్చి కోపం వస్తుంది తమ్ముడూ అంటూ పవర్ స్టార్‌తో ఫోన్‌లో సంభాషిస్తున్న సీన్ ఉంది. వాళ్లు అన్నదేమో కానీ నువ్వు ఫోన్ చేసి ఆ తిట్లు గుర్తుచేయడం అవసరమా? అంటూ చివర్లో పవర్ స్టార్ ఇచ్చే పంచ్ ఫన్నీగా ఉంది. అంతటితో ఆగకుండా రష్యన్ మహిళతో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని సైతం ఈ వివాదాల ‘పవర్ స్టార్’లోకి లాగాడు వర్మ. మొత్తంగా పవన్‌కు సంబంధించిన ప్రతి చిన్నవిషయాన్ని హైలైట్‌ చేసి చూపించాడు. ఈ ట్రైలర్ చివర్లో వర్మ వోడ్కా బాటిల్‌తో ఓ రేంజ్‌లో కనిపిస్తాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu