HomeTelugu Newsనిన్ను బికినీలో చూడాలని ఉంది.. యాంకర్‌కు షాకిచ్చిన రామ్‌ గోపాల్‌ వర్మ

నిన్ను బికినీలో చూడాలని ఉంది.. యాంకర్‌కు షాకిచ్చిన రామ్‌ గోపాల్‌ వర్మ

12 13
ఇటీవలే వరుస బూతు సినిమాలతో రెచ్చిపోతున్నాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. కరోనా కారణంగా సామాన్యులు, సెలబ్రిటీలు పనిలేకుండా ఇంటికే పరిమితమైతే వర్మ మాత్రం వరుస సినిమాలు చేస్తూ యమ బిజీగా ఉన్నాడు. సోషల్ మీడియాలో వరుస పోస్టులతో హంగామా సృష్టిస్తున్నాడు.

సినిమా ప్రమోషన్ లో భాగంగా టీవీ ఛానల్స్ కు, పేరున్న యూట్యూబ్ ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ఆర్జీవీ. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన వర్మ ఏకంగా తనని ఇంటర్వ్యూ చేసిన యాంకర్ కే షాకిచ్చాడు. ఇంటర్వ్యూలో ఆర్జీవీని ప్రశ్నిస్తూ ‘మనిషికి కోరికలు అనేవి కామన్.. మీకు తీరని కోరికలు ఏమైనా ఉన్నాయా ? అని యాంకర్ అడిగిందంట.. దానికి వర్మ యాంకర్ కు దిమ్మదిరిగే సమాధానం చెప్పాడట.

‘నాకు కోరిక పుట్టిందంటే దాన్ని వెంటనే తీర్చేసుకుంటా. ఇప్పటి వరకు నేను కోరుకున్న ప్రతికోరికను తీర్చుకున్నాను. అలా తీర్చుకోలేని కోరిక అంటూ ఏమీలేదు. ఒకవేళ తీర్చుకోలేని కోరిక అయితే దాన్ని అప్పుడే మర్చిపోతా అని చెప్పిన వర్మ ‘నిన్ను బికినీ లో చూడాలని వుంది. నీకు నచ్చితే ఓ పాత్ర చేయిస్తా లేదంటే లైట్ తీసుకుంటా’ అని వర్మ అనే సరికి యాంకర్‌కు దిమ్మతిరిగి పోయిందట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu