HomeTelugu Newsజైలు నుండి విడుదలైన రియా.. ఫొటోలు వైరల్‌

జైలు నుండి విడుదలైన రియా.. ఫొటోలు వైరల్‌

Rhea chakraborty released f
బాలీవుడ్ యంగ్‌ హీరో సుశాంత్ ఆత్మహత్యతో వెలుగులోకి వచ్చిన బాలీవుడ్ డ్రగ్స్ కేసులో అరస్ట్‌ అయిన నటి రియా చక్రవర్తికి ఎట్టకేలకు బెయిల్ మంజూరు కాగా 28 రోజుల తర్వాత తర్వాత కొద్దిసేపటి క్రితమే ఆమె ముంబయిలోని బైకుల్లా జైలు నుంచి విడుదలయింది. దీనికి సబంధించిన దృశ్యాలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ విషయంపై డీసీపీ సంగ్రాంసింగ్ నిషందర్ మాట్లాడుతూ.. రియా బెయిలుపై జైలు నుంచి బయటకు వచ్చే సందర్భంలో ఎవరైన ఆమె వాహనాన్ని వెంబడించడం, అడ్డుకోవడం వంటివి చేస్తే కటిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీడియాతో సహా వెంబండించిన వారే కాకుండా ఇలాంటి చర్యలకు ప్రేరేపించిన వారిపై కూడా ఎంవీ చట్టం ప్రకారం సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామని వెల్లడించారు.

కాగా లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై రియా చక్రవర్తికి బెయిల్ మంజూరు చేసిన బాంబే హై కోర్టు ఆమెకు పలు షరతులు విధించింది. రియా దేశం వదిలి వెళ్లరాదని, ముంబై దాటి వెళ్లాల్సి వస్తే.. కేసు విచారణ అధికారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని షరతులు విధించింది. పది రోజులకు ఒకసారి పోలీస్ స్టేషన్‌‌లో హాజరు కావాల్సి ఉంటుందని కోర్టు స్పష్టంచేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu