HomeTelugu Trendingరియాకు బెయిల్ దొరికింది

రియాకు బెయిల్ దొరికింది

Rhea gets bail in Drugs cas
బాలీవుడ్‌తో పాటు మొత్తం భారత చిత్రపరిశ్రమను గడగడలాడిస్తోంది డ్రగ్స్ ప్రకంపనలు. ఈవుడ్ ఆవుడ్ అని కాకుండా అందరినీ చుట్టేస్తోంది. బాలీవుట్ నటుడు సుశాంత్ మృతి కేసు విచారణలో భాగంగా డ్రగ్స్ లింకులు బయటపడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అరెస్టయి దాదాపు నెల రోజుల పాటు జైలులో ఉన్న సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తికి బెయిల్ దొరికింది. రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి సైతం అరెస్టయిన సంగతి తెలిసిందే. అయితే ముంబై హైకోర్టు రియాకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ముంబై వదిలి వెళ్లకూడదని కోర్టు షరతు విధించింది. ఆమె సోదరుడి బెయిల్ తిరస్కరించింది. షోవిక్‌ రిమాండ్ అక్టోబర్ 20 వరకు పొడిగించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu