HomeTelugu Trending'షకీలా' టీజర్‌

‘షకీలా’ టీజర్‌

Shakeela movie teaserదక్షిణాదిలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి షకీలా బయోపిక్‌ ‘షకీలా’ పేరుతో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇంద్రిజిత్‌ లంకేశ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌ నటి రిచా చద్దా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ రోజు ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. 1990ల కాలంలో షకీలా సినిమాలు థియేటర్‌లో విడుదలైనప్పుడు ఎలాంటి సందడి ఉండేదో ప్రచార చిత్రంలో చూపించారు. తెర వెనుక షకీలా ఎదుర్కొన్న ఎన్నో చేదు అనుభవాలను దర్శకుడు ఈ సినిమాలో చూపించనున్నట్లు సమాచారం. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో మూతపడిన థియేటర్లు తిరిగి తెరుచుకున్నాక షకీలా పేరు థియేటర్లలో వినిపించనుంది అంటూ ఈ టీజర్‌ సాగుతోంది. ఇటీవల వచ్చిన ‘మీర్జాపూర్‌’ సిరీస్‌తో అలరించిన నటుడు పంకజ్‌ త్రిపాఠి, మలయాళ నటుడు రాజీవ్‌ పిళ్లై ‘షకీలా’లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మలయాళం, హిందీ భాషల్లో డిసెంబరు 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu