పాత కథను వెలికితీస్తోన్న చరణ్!

మెగా హీరో రామ్ చరణ్ తేజ్ నటించిన ‘దృవ’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తరువాత చెర్రీ, సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. అయితే ఇప్పుడు చరణ్ మనసు ఓ పాత కథపై మళ్లిందని చెప్పుకుంటున్నారు.

వరుస హిట్స్ తో దూసుకుపోతున్న దర్శకుడు కొరటాల శివ గతంలో చరణ్ తో ఓ సినిమా చేయాలనుకున్నాడు. ఆ ప్రాజెక్ట్ ఓపెనింగ్ కూడా జరుపుకొంది. కొన్ని కారణాల వలన మధ్యలోనే ఆగిపోయింది. ఆ సమయంలో చరణ్ కు,
కొరటాల కు మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయని అందుకే సినిమా ఆగిపోయిందనే ప్రచారం జరిగింది.

అయితే ఈ వార్తల్లో నిజం లేదని కొరటాల కొట్టిపారేశాడు. చరణ్ తో తప్పకుండా సినిమా చేస్తానని అన్నాడు. ఇప్పుడు ఆగిపోయిన ఆ ప్రాజెక్ట్ మీద చరణ్ దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి ఇప్పటికే కొరటాలతో చరణ్ మాట్లాడినట్లు టాక్. ఈ సినిమా మొదలవ్వడానికి సమయం పట్టొచ్చు కానీ కచ్చితంగా వీరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందనే మాటలు వినిపిస్తున్నాయి.