HomeTelugu Trendingరోషన్‌కు ప్రముఖ నిర్మాణ సంస్థలో ఛాన్స్

రోషన్‌కు ప్రముఖ నిర్మాణ సంస్థలో ఛాన్స్

Roshan movie

ROSHAN: శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కానీ కెరీర్ ఇంకా మందకొడిగానే సాగుతోంది. `పెళ్లి సంద‌డి`తో హీరోగా తెరంగేట్రం చేసినా ఆ తర్వాత బిజీ అవుతాడ‌నుకుంటే? ఆ దిశ‌గా ప‌డుతున్న‌ట్లు క‌నిపించ‌డంలేదు.

రోషన్‌కు చెప్పుకోతగ్గ అవకాశాలు రావడం లేదు. రోషన్ కంటే వెనక వచ్చిన వారు ముందుకెళ్తున్నారు. ఇండ‌స్ట్రీలో ఎలాంటి బ్యాక‌ప్ లేని వాళ్ల‌ు కూడా అవ‌కాశాలు అందిపుచ్చుకుంటున్నారు.

తాజాగా రోషన్ విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఆల‌స్య‌మైనా రోష‌న్ ఏకంగా ఓ పెద్ద నిర్మాణ సంస్థ‌లో అవ‌కాశం ద‌క్కించుకున్న‌ట్లు తెలుస్తోంది.

రోష‌న్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ వైజ‌యంతీ మూవీస్ ఓ సినిమా చేస్తున్న‌ట్లు శ్రీకాంత్ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు. `ప్రస్తుతం రోషన్ మలయాళం సినిమా `వృష‌భ‌`లో న‌టిస్తున్నాడు. ఈ మూవీలో మోహన్‌లాల్ హీరోగా నటిస్తున్నారు. రోషన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ చేస్తున్నారు.

వృషభ సినిమా తర్వాత వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్లో ఓ సినిమా చేస్తాడ‌ని అన్నారు. వైజ‌యంతీ మూవీస్‌ నిర్మించే చిత్రంలో రోష‌న్ హీరోగా నటిస్తాడా.. లేక మ‌రో హీరో చిత్రంలో కీల‌క పాత్రా‌? అనేది క్లారిటీ ఇవ్వ‌లేదు.

శ్రీకాంత్ చిన్న కుమారుడు రోహాన్‌కి కూడా సినిమా అవ‌కాశాలు వ‌స్తున్నాయట‌. ఇటీవ‌లే ఓ సినిమాలో ఛాన్స్ వ‌చ్చిందిట‌. కానీ తొమ్మిద‌వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడ‌ని చ‌దువు ఆట‌కం ఏర్ప‌డుతుంద‌ని ఆయ‌నే రిజెక్ట్ చేసాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu