HomeTelugu Trending'ఆర్‌ఆర్‌ఆర్‌' నుండి ఫ్రెండ్‌షిప్‌డే స్పెషల్‌ పోస్టర్‌

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుండి ఫ్రెండ్‌షిప్‌డే స్పెషల్‌ పోస్టర్‌

3aమీ రామరాజు/భీమ్‌ ఎవరో చెప్పాలని అంటోంది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ యూనిట్‌. ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్న సినిమా ఇది. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

స్నేహితుల దినోత్సవం సందర్భంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్ర బృందం ఓ పోస్టర్‌ను పంచుకుంటూ.. ‘అద్భుతమైన స్నేహం ఎప్పుడూ అనుకోకుండానే మొదలవుతుంది. రామరాజు,భీంల స్నేహం మాదిరిగా.. మీ జీవితంలో అనుకోకుండా ఓ స్నేహితుడిని కలిసి ఉంటారు. అలా కలిసిన వ్యక్తుల్లో మీ జీవితంలో మీకు అత్యంత ఆప్తుడైన స్నేహితుడు ఎవరు? ఈ స్నేహితుల దినోత్సవం సందర్భంగా అతనితో దిగిన ఫొటోను మాతో పంచుకోండి’ అని పేర్కొంది.’ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో అలియాభట్‌, అజయ్‌దేవ్‌గణ్‌ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు.

3 3

Recent Articles English

Gallery

Recent Articles Telugu