HomeTelugu Big Stories'ఆర్‌ఆర్‌ఆర్‌' ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

RRR's magnanimous trailer on December 3rd

టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ రికార్డులను బద్దలు కొడుతున్న సంగతి తెల్సిందే. ఇక తాజాగా అభిమానులందరు పూనకాలతో ఊగిపోయే అప్ డేట్ ని ‘ట్రిపుల్ ఆర్’ బృందం తెలిపింది. ఈ సినిమా ట్రైలర్ ని డిసెంబర్ 3 న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

‘బిగ్గెస్ట్ బ్లాస్ట్ కోసం సిద్ధంగా ఉండండి. ప్రశాంతత లేదు.. ఇక సెలబ్రేషన్స్ ప్రారంభించండి’అని తెలుపుతూ సరికొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. సంక్రాంతి కానుకగా జనవరి 7 న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తుండగా.. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా సందడి చేయనున్నాడు. చెర్రీకి జోడిగా అలియా కనిపిస్తుండగా, తారక్ కి జోడిగా ఒలియా మోరిస్ నటిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu