HomeTelugu Big Storiesగూస్‌బామ్స్‌ తెప్పిస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' ట్రైలర్‌

గూస్‌బామ్స్‌ తెప్పిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌

RRR movie Trailer
ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలు నటిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’‌- రౌద్రం రణం రుధిరం’. ఈ మూవీ ట్రైలర్‌ గురువారం ఉదయం విడుదలైంది. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్‌ సీక్వెన్స్‌లు, రోమాలు నిక్కబొడిచే సన్నివేశాలు, ప్రతి భారతీయుడిలో ప్రేరణ నింపేలా సాగిన డైలాగ్‌లతో ట్రైలర్‌ ఆద్యంతం అదరహో అనేలా సాగింది. ఇక, అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తేజ్ కొమురం భీమ్‌గా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉంది. ‘భీమ్‌.. ఈ నక్కల వేట ఎంతసేపు.. కుంభస్థలాన్ని బద్దలుకొడదాం రా’ అంటూ రామ్‌చరణ్‌ చెప్పే డైలాగ్స్‌ ఆకట్టుకుంటున్నాయి.

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రూపొందించారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌ రామ్‌చరణ్‌కు జోడీగా సీత పాత్రలో కనిపించనున్నారు. హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌.. తారక్‌కు జంటగా నటించారు. దక్షిణాది, బాలీవుడ్‌, హాలీవుడ్‌కు చెందిన పలువురు తారలు ఇందులో కీలకపాత్రలు పోషించారు. సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మించారు. కీరవాణి స్వరాలు సమకూర్చారు. పాన్‌ ఇండియా చిత్రంగా నిర్మితమైన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా 2022 జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu