HomeTelugu Big Storiesవందకోట్ల వ్యూస్‌తో 'రౌడీ బేబి' రికార్డు

వందకోట్ల వ్యూస్‌తో ‘రౌడీ బేబి’ రికార్డు

1 billion views to Rowdy B
తమిళ నటుడు ధనుష్, ఫిదా బ్యూటీ సాయిపల్లవి జంటగా చిత్రం ‘మారి 2’. బాలాజీ మోహన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించారు. 2018లో విడుదలైన ఈ సినిమాలోని రౌడీ బేబి పాట ఎంత పాపులర్‌ అయిందో తెలిసిందే. ఈ పాట యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. లక్షల నుంచి కోట్లలో వ్యూస్‌ సాధిస్తూ దూసుకెళుతోంది. దక్షిణాదిలో అత్యధికంగా ఒక బిలియన్‌ (వంద కోట్లు) వ్యూస్‌ సాధించిన పాటగా రౌడీ బేబి రికార్డు సృష్టించింది. ఈ సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు ధనుష్‌. ‘నా సినిమా కెరీర్‌లో అనుకోకుండా ఓ మధురమైన సంఘటన చోటుచేసుకుంది. ‘కొలవెరి డీ..’ పాట విడుదలై తొమ్మిది సంవత్సరాలు పూర్తి అయిన రోజునే ‘రౌడీ బేబి’ పాట బిలియన్‌ వ్యూస్‌ సాధించడం సంతోషంగా ఉంది. పైగా దక్షిణాదిలో బిలియన్‌ వ్యూస్‌ సాధించిన పాటగా నిలవడం మాకు గర్వంగా ఉంది’’ అని తెలియజేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu