HomeTelugu Big Storiesఆస్కార్‌ బరిలో 'నాటు నాటు సాంగ్‌'

ఆస్కార్‌ బరిలో ‘నాటు నాటు సాంగ్‌’

RRR naatu naatu song oscars
దర్శకధీరుడు రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ఆస్కార్‌ ఫైనల్‌ నామినేషన్స్‌లో నిలిచింది. ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో నాటు నాటు సాంగ్‌ టాప్‌ -4లో నిలిచింది. ఇప్పటికే చలన చిత్ర పరిశ్రమలో రెండో ప్రతిష్ఠాత్మకమైన గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును నాటు నాటు సాంగ్ కోసం ఆర్‌ఆర్‌ఆర్‌ అందుకున్న విషయం తెలిసిందే.

బాహుబలి సినిమాతో పాన్‌ ఇండియా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి.. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో అంతర్జాతీయ దర్శకుడిగా మారిపోయాడు. ఈ సినిమా రిలీజైనప్పటి నుంచి మంచి ఆదరణ పొందుతుంది. ముఖ్యంగా నాటు నాటు సాంగ్‌ ఇండియన్స్‌తో పాటు విదేశీయులను సైతం ఆకట్టుకుంది. ఇందులో నాటు నాటు సాంగ్ కోసం విదేశీ సెలబ్రెటీలు సైతం డ్యాన్స్‌లు చేశారు. అంతలా ఫిదా చేసింది కాబట్టే ఈ నాటు నాటు సాంగ్‌ను గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు వరించింది. ఈ అవార్డు రావడంతో ఆస్కార్‌ బరిలో కూడా నిలుస్తుందని అంతా భావించారు. అనుకున్నట్టే ఫైనల్‌ నామినేషన్స్‌లో నిలిచింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu