ప్రియాంకకు మరో రెండు ఆఫర్లు!

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొంది హాలీవుడ్ లో అడుగుపెట్టిన బ్యూటీ ప్రియాంక చోప్రా. రీసెంట్ గా ఆమె నటించిన ‘బేవాచ్’ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. అందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించిన ప్రియాంక చోప్రా గ్లామర్ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆమె బికినీ లుక్స్ హాలీవుడ్ లో చాలా మందిని ఎట్రాక్ట్ చేశాయి. ఇప్పుడు ఆ గ్లామరే ప్రియాంకకు రెండు హాలీవుడ్ ఆఫర్లు వచ్చేలా చేశాయి. ‘ఎ కిడ్ లైక్ జేక్’ అనే సినిమాలో ప్రియాంక చోప్రాను తీసుకోవాలని మేకర్స్ ఆమెను సంప్రదించారు.
రొమాంటిక్ డ్రామగా రాబోతున్న ఈ సినిమాలో నటించడానికి ప్రియాంక అంగీకరించినట్లు తెలుస్తోంది. అలానే ‘ఈజ్ ఇట్ రొమాంటిక్’ అనే కామెడీ ఎంటర్టైనర్ లో కూడా ఆమెను తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఈ రెండు సినిమాల్లో కూడా ప్రియాంక పాత్రలు ఎలా ఉండబోతున్నాయనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. బేవాచ్ తో దెబ్బతిన్న ఈ బ్యూటీ ఈ అవకాశాలను ఎలా సద్వినియోగం చేసుకుంటుందో.. చూడాలి!