HomeTelugu Newsఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాతకు కరోనా

ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాతకు కరోనా

RRR producer tests coronavటాలీవుడ్‌లోనూ క‌రోనా విస్తరిస్తుంది. ఇప్ప‌టికే డైరెక్ట‌ర్ రాజ‌మౌళి, తేజ, ‌సింగ‌ర్ స్మిత‌ క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత డీవీవీ దాన‌య్య‌కు క‌రోనా సోకిన‌ట్లు నిర్ధార‌ణ అయింది ఆయ‌న ‘జంబ‌ల‌కిడి పంబ’ అనే వైవిధ్య‌భ‌రిత‌మైన‌ కామెడీ చిత్రంతో నిర్మాత‌గా వెండితెర‌పై ప్ర‌వేశించారు. అది సూప‌ర్ డూప‌ర్ హిట్ సాధించ‌డంతో తొలి చిత్రంతోనే హిట్ ప్రొడ్యూస‌ర్‌గా పేరు సంపాదించుకున్నారు. ఆ త‌ర్వాత ఆయ‌న నిర్మించిన‌ మావిడాకులు, స‌ముద్రం కూడా ప్రేక్ష‌కు మ‌న‌సు గెలుచుకున్నాయి. దాన‌య్య‌ చివ‌రిసారిగా ‘విన‌య విధేయ రామ’ చిత్రానికి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 8న సంక్రాంతి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu