ఘనంగా శ్వేతా, రోహిత్‌ వివాహం

నటి శ్వేతా బసు ప్రసాద్‌, ఫిల్మ్‌మేకర్‌ రోహిత్‌ మిట్టల్‌ల వివాహం గురువారం రాత్రి పుణెలో ఘనంగా జరిగింది. బెంగాలీ సంప్రదాయంలో జరిగిన పెళ్లి వేడుకలో పింక్‌ కలర్‌ సిల్క్‌ సారీలో శ్వేతా బసు మెరిసిపోయారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులతోపాటు, పలువురు సన్నిహితులు హాజరయ్యారు. అంతకు ముందు జరిగిన పెళ్లి వేడుకల్లో శ్వేతా బసు, రోహిత్‌ మిట్టల్‌ల కుటుంబ సభ్యులు, స్నేహితులు డ్యాన్సులతో సందడి చేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను శ్వేతా బసు తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. రోహిత్‌ కూడా ‘హో గయి’ అంటూ పెళ్లి ఫొటోను ఫెస్‌బుక్‌లో ఉంచారు.

మక్డీ చిత్రం ద్వారా చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్వేతా బసు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో తొలి సినిమాతోనే సంచలనాలు సృష్టించిన శ్వేతా బసు.. ఆ తర్వాత టాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ముంబైకే పరిమితమైన శ్వేతా బసు.. పలు టీవీ సీరియల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

CLICK HERE!! For the aha Latest Updates