HomeTelugu Trendingఆలియా భట్‌కు 'ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి స్పెషల్‌ విషెస్‌

ఆలియా భట్‌కు ‘ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి స్పెషల్‌ విషెస్‌

3 14
బాలీవుడ్‌ హీరోయిన్‌ ఆలియాభట్‌ పుట్టినరోజు సందర్భంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీం స్పెషల్‌ విషెస్‌ తెలిపారు. ఈ మేరకు ఆర్‌ఆర్‌ఆర్‌ బృందం ఓ ట్వీట్‌ పెట్టారు. ‘మనోహరమైన వ్యక్తిత్వం ఉన్న అసాధారణమైన నటి ఆలియాభట్‌కు ఆర్‌ఆర్‌ఆర్‌ టీం నుంచి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు మాతో కలిసి పనిచేసే రోజు కోసం మేము ఎంతో ఆసక్తిగా ఉన్నాం’ అని ఆర్‌ఆర్‌ఆర్‌ బృందం పేర్కొంది.

దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్‌చరణ్‌కు జంటగా ఆలియాభట్‌, కొమరంభీంగా కనిపించనున్న ఎన్టీఆర్‌కు జంటగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌ నటించనున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu