HomeTelugu Trendingప్రభాస్‌ హీరోయిన్‌కి మహేష్‌బాబు అంటే ఇష్టమట!

ప్రభాస్‌ హీరోయిన్‌కి మహేష్‌బాబు అంటే ఇష్టమట!

10 26ప్రభాస్ ‘సాహో’ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చురుగ్గా సాగుతున్నాయి. ఆగష్టు 30 వ తేదీన సినిమాను విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు. అతి త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ విడుదల కాబోతున్నది. ప్రచారాన్ని షురూ చేసేందుకు యూనిట్ సిద్ధం అవుతున్నది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఇటీవలే ఈ సినిమా హీరోయిన్ శ్రద్దా కపూర్ బాలీవుడ్ మీడియాకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో అనేక విషయాలను వెల్లడి చేసింది. టాలీవుడ్‌లో మీకు ఇష్టమైన హీరో ఎవరు అని అడిగితే.. శ్రద్ధా కపూర్ ఏ మాత్రం తడుముకోకుండా … మహేష్ బాబు అని చెప్పేసింది. మరి ప్రభాస్ అని అడిగితే .. ప్రభాస్ తనకు మంచి స్నేహితుడని చెప్పింది. ప్రభాస్ తో సినిమా చేస్తున్న హీరోయిన్, మహేష్ బాబు అంటే ఇష్టం అని చెప్పడంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. పాపం శ్రద్ధాపై ఫైర్ అవుతున్నారు. వచ్చేనెల 15 వ తేదీ నుంచి ఈ సినిమాకు సంబంధించిన ప్రచారం ఊపందుకోబోతున్నది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu