‘సాహో’కి గుమ్మడికాయ కొట్టేశారు.. పార్టీ చేసుకున్న మూవీయూనిట్‌

యంగ్ రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటించిన ‘సాహో’ సినిమాకు ఎట్టకేలకు గుమ్మడికాయ కొట్టేశారు. సోమవారంతో సినిమాకు సంబంధించిన చిత్రీకరణ అంతా పూర్తయింది. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ చిత్రబృందంతో కలిసి సెల్ఫీ దిగారు. అంతేకాదు పార్టీ కూడా చేసుకున్నారు. చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా పలువురు టెక్నీషియన్లతో కలిసి ప్రభాస్‌ దిగిన ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 2017 జూన్‌ 9న ‘సాహో’ చిత్రీకరణ ప్రారంభమైంది. భారతీయ అతిపెద్ద యాక్షన్‌ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాను పూర్తిచేయడానికి 25 నెలలు పట్టింది. సుజిత్‌ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోశ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది‌. నీల్‌ నితిన్‌ ముఖేశ్‌ విలన్‌ పాత్ర పోషించారు. జిబ్రాన్‌ సంగీతం అందించారు. ఇటీవల సినిమాలోని ‘సైకో సయ్యా’ అనే మొదటి పాటను విడుదల చేశారు. సినిమాను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.