థియేటర్లలో ప్రభాస్‌ ఫాన్స్‌ రచ్చ.. వీడియో షేర్‌ చేసిన శ్రద్ధ

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ‘సాహో’ మూవీ టీజర్‌ దూసుకెళుతోంది. ఇప్పటివరకు దాదాపు ఆరు కోట్ల మందికి పైగా టీజర్‌ను వీక్షించారు. ఈ నేపథ్యంలో ఓ వీడియో శ్రద్ధను సర్‌ప్రైజ్‌ చేసింది. గురువారం తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో ‘సాహో’ టీజర్‌ను ప్రదర్శించారు. టీజర్‌ చూస్తూ అభిమానులు ఈలలు వేస్తూ, కాగితాలు ఎగరేస్తూ రచ్చ చేశారు. ఆ సమయంలో తీసిన వీడియోను శ్రద్ధ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘ప్రభాస్‌తో, సుజీత్‌తో కలిసి పనిచేయడం ఓ కలలా ఉంది. చిత్రబృందం పడిన రెండేళ్ల కష్టానికి ఈ రకమైన స్పందన చూసి చాలా సంతోషిస్తున్నాం. ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. అయితే శ్రద్ధ పోస్ట్‌ చేసిన వీడియో ఇక్కడి థియేటర్‌ లోనిదా? లేక ముంబయిలోని థియేటర్‌లో చిత్రించిందా అన్నది తెలియరాలేదు. ‘సాహో’ సినిమాను ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.