HomeTelugu Big Storiesరికార్డు సృష్టించబోతున్న ప్రభాస్

రికార్డు సృష్టించబోతున్న ప్రభాస్

6 14యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించాడు.. ఇప్పుడు సాహోతో మరికొన్ని రికార్డులు బద్దలు కొట్టేందుకు సిద్ధమైయ్యాడు. ఈ నెల 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం.. అయితే, విడుదలకు ముందే రికార్డుల వేట ప్రారంభించాడు డార్లింగ్‌. వరల్డ్ వైడ్‌గా ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 350 కోట్లు దాటిపోగా.. ఓ థియేటర్‌లో ఈ సినిమా ప్రదర్శనతో సౌత్ ఇండియన్ నంబర్ వన్ హీరోగా రికార్డు సృష్టించనున్నాడు. సాహో చిత్రాన్ని పారిస్‌లోని ప్రతిష్టాత్మక థియేటర్ “లి గ్రాండ్ రెక్స్”లో ప్రదర్శించనున్నారు. యూరప్‌ ఖండంలోనే అతిపెద్ద ధియేటర్‌గా ప్రసిద్ధిగాంచిన ఈ థియేటర్‌కు వంద ఏళ్లకు పైగా చరిత్ర ఉంది.

లి గ్రాండ్ రెక్స్ థియేటర్‌ను 1932లో ప్రారంభించారు.. అప్పటినుండి అనేక ప్రఖాత్య సాంస్కృతిక, కళా, సినిమా ప్రదర్శనలకు వేదికగా మారిపోయింది. ఒకేసారి ఈ హాల్‌లో 2800 మంది మూవీని వీక్షించవచ్చు. అలాంటి ప్రఖ్యాత థియేటర్లో సాహో మూవీ ప్రదర్శించనున్నారు. గతంలో సూపర్ రజనీకాంత్ కబాలి, విజయ్ మెర్సల్, బాహుబలి చిత్రాలు మాత్రమే సౌత్ ఇండియా నుంచి ప్రదర్శించగా.. ఇప్పుడు సాహో కూడా విడుదల కానుంది. అయితే, బాహుబలి తర్వాత సాహో కూడా అక్కడ రిలీజ్ చేయనుండడంతో సౌత్ ఇండియాలోనే రెండు సినిమాలు ఆ థియేటర్‌లో విడుదల చేసిన తొలి హీరోగా ప్రభాస్ రికార్డు సృష్టించబోతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu